. . . జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున వారికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునేల చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బోధన్ డివిజన్ లోని పల్లె దావకానాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఎంఎల్ హెచ్ పీలకు, ఏఎన్ఎంలకు, డీఈఓ లకు హెచ్ఎంఐఎస్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిడిఎం నారాయణ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎంఎల్ హెచ్ పీలు, ఏఎన్ఎంలు రోజు వారి విధుల్లో అందించే వైద్య ఆరోగ్య సేవలను ముఖ్యంగా గర్భిణీ స్త్రీల నమోదు, హాస్పిటల్లో జరిగిన ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాలు, మాతా శిశు మరణాలు, జీవనశైలి వ్యాధులపై చేస్తున్నటువంటి నిర్ధారణ పరీక్షలు మొదలగు వైద్య సేవలు అన్నింటిని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం నందు వైద్య సేవలు అందించిన వెంటనే ఎంటర్ చేయాలన్నారు. ఎం సి హెచ్ పోర్టల్ లో ఉన్న సమాచారము హెచ్ఎంఐఎస్ పోర్టల్ లో ఉన్న సమాచారo ఒకే విధంగా ఉండాలన్నారు. వడదెబ్బపై ఆశాలు గ్రహ సందర్శనలో ఇంటింటికి అవగాహన కల్పించాలని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా తరచుగా వాటర్ తీసుకోవాలని, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు, సీజనల్ ఫ్రూట్స్ లాంటివి తప్పకుండా తీసుకోవాలన్నారు. శీతల పానీయాలకు, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా.వినయ్ కుమార్, డా.వెంకటేష్, డా.శ్రావ్య, డి హెచ్ ఈ గన్ పూర్ వెంకటేశ్వర్లు, సలీం. వివిధ పీ హెచ్ సీల ఎమ్మెల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, డిఈఓ లు పాల్గొన్నారు.

