24 C
Hyderabad
Sunday, August 2, 2026

జీజీహెచ్ సూపరీంటెండెంట్ ని కలిసిన యూనియన్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా నియమితులైన పోరెన్సీక్ ప్రొఫెసర్ డా.నాగమోహన్ ని గురువారం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఘన్ పూర్ వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ డా.నాగమోహన్ నాయకత్వంలో ఆసుపత్రి సేవలు పేద ప్రజలకు ఉపయోగపడేలా మరింత మెరుగుపడతాయని, ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, రవిగౌడ్, కార్యనిర్వాహక కార్య దర్శులు సురేష్ రెడ్డి, స్వామి, కార్యవర్గ సభ్యులు రమేష్, విద్యా ప్రవీణ, సుధాకర్, రమేష్, మోహన్ రావు, సభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article