26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అక్షర పాలిసెట్ కోచింగ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పరీక్ష విధానాన్ని తెలియజేసిన ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకుడు జాలిగామ శ్రీకాంత్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజన్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును, పాలీసెట్ నమూనా పరీక్ష ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కోర్సులతో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నాయని, ఈ విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులను కూడా ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోటీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు దానికి అనుగుణమైన ప్రణాళికలను రూపొందించుకొని ర్యాంకులను సాధించాలని విద్యార్థులకు సూచించారు. అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ లో ర్యాంకులు సాధించడానికి కావాల్సిన శిక్షణను అందజేయడం జరుగుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థులకు వారి యొక్క సూచనలను సలహాలను అందజేస్తారని ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.

 

Awareness seminar under the auspices of Akshara Polycet Coaching

More articles

Latest article