నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆసుపత్రి వైద్యలు ఛాతివైద్య నిపుణులు డా.ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త థీమ్o తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహింస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం న్యుమోనియాపై పోరాటం అనే థీమ్ తో ప్రచారం నిర్వహింస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలకు కారణమైన ప్రపంచంలోనే అతిపెద్ద అంటువ్యాధి న్యుమోనియా అనేది బాక్టీరియా, వైరస్‌లు లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏర్పడే ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిజార్డర్ అని తెలిపారు. ఇది ఊపిరితిత్తుల గాలి సంచులను “అల్వియోలీ” అని పిలుస్తారని అన్నారు. ఇది గాలి సంచులలో ద్రవం లేదా చీము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని అన్నారు. ఇది ఒక అంటు వ్యాధి, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చునని తెలిపారు. న్యుమోనియా అనేది నివారించదగిన, చికిత్స చేయగల అంటు వ్యాధి అని పేర్కొన్నారు. చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, గత సంవత్సరాల్లో న్యుమోనియా, ఇతర శ్వాసకోశ అంటువ్యాధుల కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా కారణంగా పెద్దలు, చిన్నపిల్లలు కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. 2 లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 అంతకంటే ఎక్కువ వయస్సు పెద్దవారు, ఆస్తమా, దీర్ఘకాలికి సీఓపీడీ, గుండె వ్యాధులు ఉన్నవారు, సిగరెట్ స్మోకింగ్ అధికంగా చేసేవారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిఉన్నవారు, కొన్ని రసాయనాలు, కాలుష్య కారకాలకు, విషపూరిత పొగలకు గురైనవారు. ఈ వ్యాధికి గురైన వారు దగ్గు, రక్తంతో కూడిన కఫం , చలి జ్వరం, శ్వాస కోశాల్లో నొప్పి, ఛాతీ భాగంలో నొప్పి, తలనొప్పి, ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. కొందరిలో వికారం, వాంతులు లేదా విరేచనాలు కలుగుతాయని అన్నారు. న్యుమోనియా అంటువ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల క్రిములు మనం పీల్చే గాలిలోకి వ్యాప్తిచెందుతాయి అని అన్నారు. ఈ సమావేశం లో డీఎంఎస్ డా. యజ్ఞ, ఆసుపత్రి హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినాయకుమార్ పాల్గొన్నారు.
