- సీఐ వెంకట నారాయణ
బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ శనివారం పోలీసులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ సందర్భంగా ఆయన ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ,వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడకూడదనీ, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఇతర వర్తక కేంద్రాలు రాత్రి 10:30 గంటలకు మూసివేయాలని చెప్పారు. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు ప్రజల హితమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలు పూర్తిగా సహకరించాలని సీఐ వెంకట నారాయణ అన్నారు.

