29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బేటి బచావో.. బేటి పడావో.. కార్యక్రమంపై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల ప్రాముఖ్యత, లింగ వివక్షత, ఆల్ టోల్ ఫ్రీ నెంబర్స్, లైఫ్ లో ఎదురయ్యే సమస్యలను  ఎలా ఎదుర్కోవాలి సరైన టైంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి,అనే విషయాల పైన పిల్లలకి అవగాహన కల్పించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రసూల్ బి తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్ట్, డిచ్ పల్లి ప్రాజెక్ట్ నందుగల గవర్నమెంట్ పాఠశాలలు మాణిక్ బండార్, బోర్గం కె, చిన్నాపూర్, మాక్లూర్, మామిడిపల్లి, దుబ్బ, చంద్రశేఖర్ కాలనీ లోగల గవర్నమెంట్ హై స్కూల్ లో గల ఎనిమిదవ, తొమ్మిదవ తరగతి బాలికలకు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్  ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ నుండి విచ్చేసినటువంటి శ్రీహరి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గారు, మహిపాల్ సార్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గారు పిల్లలకి చైల్డ్ రైట్స్, స్కిల్స్ కెరీర్ గైడెన్స్, పబ్లిక్ స్పీకింగ్, కెపాసిటీ బిల్డింగ్, జెండర్ ఈ క్వాలిటీ, పోక్సో ఆక్ట్, పబ్లిక్ స్పీకింగ్,పర్సనాలిటీ డెవలప్మెంట్, బై స్టాండర్డ్ ఇంటర్వెన్షన్, ఓరియంటేషన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్,కెరీర్ గైడ్లైన్స్ గోల్ సెట్టింగ్స్, సాఫ్ట్ స్కిల్స్,ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్,వాటిపైన ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ  సౌందర్య, జ్యోతి, సూపర్వైజర్ ప్రియ, వరలక్ష్మి, మమత, డాటా ప్రో డిస్టిక్ కో ఆర్డినేటర్ లహరి, ఆనంద్,ఎక్సైజ్ ఎస్సై రవి, స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, డిహెచ్ డబ్ల్యు టీం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, జెండర్ స్పెషలిస్ట్ సౌమ్య, కవిత ఆర్ధిక అక్షరాస్యత నిపుణురాలు పుష్ప, అకౌంటెంట్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Awareness about the Beti Bachao.. Beti Padhao.. program

More articles

Latest article