బేటి బచావో.. బేటి పడావో.. కార్యక్రమంపై అవగాహన
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల ప్రాముఖ్యత, లింగ వివక్షత, ఆల్ టోల్ ఫ్రీ నెంబర్స్, లైఫ్ లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి సరైన టైంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి,అనే విషయాల పైన పిల్లలకి అవగాహన కల్పించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రసూల్ బి తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో డాటా ప్రో ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా నిజామాబాద్ అర్బన్...