30.2 C
Hyderabad

అయోడిన్ లోపం పై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మర్‌పల్లి కి చెందిన వైద్యులు నర్సింహ స్వామి జిల్లా పరిషత్ హై స్కూల్ లో అయోడిన్ లోపం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోడిన్ యొక్క ప్రాధాన్యత, అది శరీర వృద్ధి, మేధస్సు అభివృద్ధిలో చేసే కీలక పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలు, లక్షణాలు, నివారణ చర్యలు గురించి అనేక విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. అయోడైజ్డ్ ఉప్పు వినియోగం ద్వారా అయోడిన్ లోపాన్ని నివారించవచ్చని సూచించారు. విద్యార్థులు,  కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విలువైన ఆరోగ్య సమాచారం పొందారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article