29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

 జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె అభిలాష్, అనే విద్యార్థికి జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతి లభించింది. మాచిరాజు బాల సాహిత్య కళా పీఠం వారు గత నెలలో జాతీయస్థాయి కథల పోటీలను నిర్వహించడం జరిగింది. దీనిలో సుమారు రెండు రాష్ట్రాల నుండి 250 కి పైగా కథలను విద్యార్థులు పంపగా,అందులో నుండి 20 ఉత్తమ కథలను ఎంపిక చేసి బహుమతిని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కె అభిలాష్ రాసిన (మంచి మనసు)అనే కథకు గాను బహుమతి లభించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చారి తెలిపారు. దీనికి నగదు బహుమతితో పాటు జ్ఞాపిక,   ప్రశంసా పత్రమును నవంబర్ 3 వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో  అందజేస్తారని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. జాతీయస్థాయిలో బహుమతి సంపాదించిన అభిలాష్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణా చారి, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

More articles

Latest article