27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల : తాళ్ల రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి సోయా కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంఘ పరిధిలోని గ్రామ రైతులు, ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర4892/పొందాలని తెలిపారు. అలాగే సొసైటీకి సోయలు విక్రయించేవారు, తమ యొక్క పట్టాదారు పాస్ బుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, జిరాక్స్ ఏ ఈ ఓ ధ్రువీకరణ పత్రం తీసుకు రావాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ బుచ్చన్న, మార్క్ ఫైడ్ డి ఎం నిరంజన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరి పెళ్లి లింగారెడ్డి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవా రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగా ప్రసాద్, దేశ బోయిన చిన్న సంజీవ్ యాదవ్, వెంకయ్య గారి రవి,ఏర్గట్ల పచ్చిమట్ల రమేష్ గౌడ్, బద్దం ప్రభాకర్ లు పాల్గొన్నారు.

Inauguration of buying center under Mark Fed

More articles

Latest article