జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె అభిలాష్, అనే విద్యార్థికి జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతి లభించింది. మాచిరాజు బాల సాహిత్య కళా పీఠం వారు గత నెలలో జాతీయస్థాయి కథల పోటీలను నిర్వహించడం జరిగింది. దీనిలో సుమారు రెండు రాష్ట్రాల నుండి 250 కి పైగా కథలను విద్యార్థులు పంపగా,అందులో నుండి 20 ఉత్తమ కథలను ఎంపిక చేసి బహుమతిని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కె...