వరంగల్ జిల్లాలో ఘటన
వెబ్ డెస్క్, బతుకమ్మ : ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ చేయడం లేదని ఆవేదన చెంది ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ జిల్లాలోని మైలారం సబ్ స్టేషన్ లో శనివారం ఉదయం ఈఘటన చోట చేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ చేయడానికి నెలరోజులు సరిపోవా అని, పంట వేసే మార్గం లేక, ఒంటిపై పెట్రోల్ పోసుకుని రైతు రమేష్ బలవన్మరణానికి యత్నించాడు. స్థానికంగా ఈఘటన కలకలం రేపింది. స్థానికులు అడ్డుకోని రైతు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింప చేశారు. డీడీ కట్టి వందసార్లు మొరపెట్టుకున్నా ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారని రైతు ఆరోపిస్తున్నారు. కాగా, ఈఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
