చత్తీస్ ఘడ్, బతుకమ్మ : చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా లో మావోయిస్టులు ఐ ఈ డి తో పేలుడుకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఒక ఏఎస్పి మృతి, మరికొందరికి గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి కుంట ఏఎస్పి ఆకాశరావుగా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన వారిలో కుంట సిఐ, డీఎస్సీ , ఆస్పత్రికి తరలించారు. నక్సల్ ఆపరేషన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘటన జరిగింది. కుంట సమీపంలోని డొండ్రా అటవీ ప్రాంతంలో పేలిన ప్రెజర్ బాంబ్ ఘటనతో ఆపరేషన్ కధారపై మావోయిస్టులు సవాల్ విసిరినట్టయింది. ఇటీవల కాలంలో చత్తీస్గడ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులను కోల్పోయిన తర్వాత తొలిసారి ఎదురుదాడికి దిగినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
