24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 ఫేక్ యాప్ లతో మోసగిస్తున్న ఇద్ధరి అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

జిల్లా కేంద్రంలో ఎం జి ఐ- యాప్ ద్వార ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎసిపి రాజా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. ఆన్ లైన్ యాప్ ( ఎంజీఐ ) ద్వార 12 మంది నుంచి రెండు లక్షల యాబై వేల రూపాయలు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ నార్త్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మయ్య ల ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టగా నగరంలోని ముజాహిద్ నగర్ కు చెందిన ఫోటోగ్రఫీ పని చేసే షేక్ అమీర్ అలియాస్ ఖలీల్, భర్కత్ పుర కు చెందిన డెలివరీ బాయ్ గా పని చేసే సయ్యద్ ఇమ్రాన్ అలీలను అదుపులోకి తీసుకోవడంతో కేసు కొలిక్కి వచ్చిందని ఏసీపీ తెలిపారు. ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా అని టెలిగ్రాం యాప్ లో వెతుకుతుండగా ( ఎంజి ఐ) యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టాలని షేక్ అమీర్ ముందుగా తెలుసుకున్నారు, అతని ద్వారా సయ్యద్ ఇమ్రాన్ జాయిన్ అయ్యారని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఇద్దరు కొందరిని మెంబర్ లుగా చేర్పించారని దాని కోసం నగరంలోని ముజాహిద్ నగర్ హష్మీ కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దానికి యాప్ నిర్వహకుల ద్వార డబ్బులు పొందిన ఇద్దరు చాలా మంది చేత పెట్టుబడులు పెట్టించారని తెలిపారు. స్కానర్ ద్వారా పెట్టుబడులు పెట్టించి వాటిని మళ్లీ వెనక్కి తీసుకోకుండా ప్రీజ్ చేసేవారని, ఆఫర్స్ డబ్బులు పొందాలంటే మళ్లీ పెమేంట్ చేయాలని మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎంజి ఐ యాప్ పర్చువల్ యాప్ ఐపి అడ్రస్ కాలిఫోర్నియాలోని లాస్ ఎంజిల్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు, భారత్ లో శాలి వర్మ ఆపరేట్ చేస్తున్నట్టు చేసి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఎంజి ఐ యాప్ లో ఓకరిని చేర్పించిన యాభై రూపాయల నుంచి 100 రూపాయలు లబ్ధి పొందుతారని మోసపూరితంగా రూ.80 వేల వరకు సంపాదించారని తెలిపారు. ఇద్దరు ఐదు నెలల కాలంలో యాప్ ద్వారా ప్రజలను మోసం చేయగా ప్రారంభదశలోనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు.  భధశలోనే ఇద్ధరిని అరెస్టు చేసినట్టు ఎసిపి తెలిపారు.

Arrested for cheating with fake apps

More articles

Latest article