26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే తెలంగాణ కు న్యాయం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 నిజామాబాద్, బతుకమ్మ :

తెలంగాణ కు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగింది.ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా మారిందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల  ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ పై వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి మాట్లాడుతు… బిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రాన్ని కోరుతున్నా.. నవోదయా,సైనిక్ స్కూళ్లు,ఐఐఎం,ట్రిపుల్ ఐటి లాంటి విద్యాలయాల ప్రకటన గానీ తెలంగాణకు ఉపయోగపడే మరే అంశంగానీ బడ్జెట్ లో లేదు అని తెలిపారు. ఇచ్చేవాళ్ళు బీజేపీ నుంచి 8 మంది ఎంపీ లు తెలంగాణ లో ఉన్నా నిధులు సాధించింది సున్నా  అన్నారు. రాష్ట్రానికి నిధులు కోసం కొట్లాడాల్సిన కాంగ్రెస్ వాళ్ళు 8 ఎంపిలు ఉన్న సాధించింది శూన్యం అని పేర్కోన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీ లుంటేనే తెలంగాణ కు న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు గమనించాలి అని కోరారు.

More articles

Latest article