- చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వినర్ ఆకుల పాపయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపించి నడిపించాలని డిమాండ్ తో ఈనెల 5న నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వినర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. నగరంలోని ఆర్య నగర్ లో గల చెరుకు నాయకులు పోచారం సంతోష్ నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినారు. ఈ సదస్సును జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సహకార రంగంలో కొనసాగిన ఏకైక చెక్కర ఫ్యాక్టరీ ఎన్సిఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ అని, ఇది నిజామాబాద్ లో నాలుగు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని 70 గ్రామాలలో ఇప్పటికీ చెరుకు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించి నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీలో 23,000 మంది సభ్యులుగా 8,000 మంది రైతులు రెగ్యులర్గా చెరుకు సప్లై చేసే వారని, ఇందులో 6వేల మంది వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుందని, పర్మినెంట్గా 500 మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఈ ఫ్యాక్టరీ 99 ఎకరాల విస్తీర్ణంలో ఉందని దీనిని అమ్ముకుంటే 400 నుంచి 500 కోట్ల రూపాయలకు వస్తాయని దీనిని అమ్ముకుందామని కొందరు రాజకీయ నాయకులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వారి ఎత్తులు రైతు ఉద్యమం ముందు ఫలించలేక చతికిల పడ్డారని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకు ఇచ్చిన మాట ప్రకారం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని అందుకు అసెంబ్లీలో సబ్ కమిటీ వేశారని, వేసిన సబ్ కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి పరిశీలించందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బిఆర్ఎస్ పార్టీ లాగా కాలయాపన చేయకుండా చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు తగిన కృషి చేసి తగిన నిధులను కేటాయించాలని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ రైతు నాయకులు పోచారం సంతోష్, బి. లక్ష్మారెడ్డి, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పుర్ భూమయ్య, కొట్టే గంగాధర్, ఆర్. పృధ్విరాజ్, పాల్గొన్నారు.
