29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వాతంత్య్రోద్యమ అమరవీరులకు ఘన నివాళులు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను  స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సారథ్యంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి,  కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tributes to the martyrs of freedom struggle

More articles

Latest article