30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025 కు దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పార్శీ అశోక్ తెలిపారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో  బ్రోచర్, పోస్టర్ లను  నిజామాబాద్ డి ఇ ఓ అశోక్  విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆశోక్ మాట్లాడుతు.. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30 తేది అని  ఆన్లైన్లో దరఖాస్తు  చేసుకోవాలని కోరారు.6 నుండి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి 25 వేల రూపాయలు బహుమతి అని తెలిపారు. డి ఆర్ డి ఓ సి ఎస్ ఐ ఆర్ మొదలైన గొప్ప సైన్స్ ల్యాబ్ లలో సందర్శించే అవకాశం తో పాటు జాతీయ స్థాయి విజేతలకు ఇంటర్షిప్ అవకాశం ఉంటుందని తెలిపారు. పరీక్షా విధానం ఆయా తరగతుల సైన్స్, గణిత శాస్త్రం లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ, పురాతనం నుండి ఆధునికం వరకు భారతీయ శాస్త్రవేత్తల కృషి. శాస్త్రవేత్త సతేంద్రనాథ్ బోస్ గారి జీవిత చరిత్రపై ఉంటుందని తెలిపారు.  ప్రతి పాఠశాల విద్యార్ధులు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సూచించారు  వివరాలకు వి వి ఎమ్ జిల్లా కోఆర్డినేటర్లు శ్రీపాద్ 9441046820 ,ముద్దుకృష్ణ 7075151286 ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి సెక్రేటరీ సీతయ్య, సైన్స్ ఆపీసర్ గంగాకిషన్ ఉన్నారు.

More articles

Latest article