25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

డిగ్రీ, పీజీ విద్యార్థులకు అపార్ ఐడి తప్పనిసరి

Must read

📰 Generate e-Paper Clip

  • రిజిస్ట్రార్  ప్రొ.ఎం.యాదగిరి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్  కరస్పాండెంట్లో సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన  రిజిస్ట్రార్ ఆచార్య యం యాదగిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ పీజీ విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకెడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ నెంబర్  ( అపార్ ఐడి )ఉండాలన్నారు.  ఈ నెంబరు భవిష్యత్తులో  విద్యార్థులు  కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి, ఉద్యోగిత పొందినప్పుడు  విద్యార్హతల ధ్రువీకరించుకొనుటకు ఉపయోగపడుతుందన్నారు. విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులకు  ఇది ప్రధాన ధ్రువీకరణ పత్రంగా  ఉపయోగపడుతుందన్నారు. అన్ని కళాశాలలో ఈ   వేగవంతం చేసి  ఈనెల 19 లోపు  పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల  ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు తోపాటు  కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆచార్యకే సంపత్ కుమార్, ఎన్ ఇపి కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్లు పాల్గొన్నారు.

Apar ID is mandatory for degree and PG students

More articles

Latest article