- రిజిస్ట్రార్ ప్రొ.ఎం.యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్ కరస్పాండెంట్లో సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య యం యాదగిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ పీజీ విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకెడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ నెంబర్ ( అపార్ ఐడి )ఉండాలన్నారు. ఈ నెంబరు భవిష్యత్తులో విద్యార్థులు కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి, ఉద్యోగిత పొందినప్పుడు విద్యార్హతల ధ్రువీకరించుకొనుటకు ఉపయోగపడుతుందన్నారు. విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులకు ఇది ప్రధాన ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుందన్నారు. అన్ని కళాశాలలో ఈ వేగవంతం చేసి ఈనెల 19 లోపు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు తోపాటు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆచార్యకే సంపత్ కుమార్, ఎన్ ఇపి కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్లు పాల్గొన్నారు.
