డిగ్రీ, పీజీ విద్యార్థులకు అపార్ ఐడి తప్పనిసరి

రిజిస్ట్రార్  ప్రొ.ఎం.యాదగిరి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనుబంధ కళాశాల ప్రిన్సిపల్స్  కరస్పాండెంట్లో సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన  రిజిస్ట్రార్ ఆచార్య యం యాదగిరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ పీజీ విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకెడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ నెంబర్  ( అపార్ ఐడి )ఉండాలన్నారు.  ఈ నెంబరు భవిష్యత్తులో  విద్యార్థులు  కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి, ఉద్యోగిత పొందినప్పుడు  విద్యార్హతల ధ్రువీకరించుకొనుటకు ఉపయోగపడుతుందన్నారు. విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులకు  ఇది ప్రధాన ధ్రువీకరణ పత్రంగా  ఉపయోగపడుతుందన్నారు....