29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డిమాండ్స్ బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ విధుల నిర్వహణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించటం తో పాటు డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంగన్వాడి ఉద్యోగులు ఆయా కేంద్రాలలో బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జూలై 10 న డిమాండ్స్ డే ను నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు బి ఎల్ ఓ విధులు నిర్వహించటంతో విధులకు ఆటంకం కలగకుండా డిమాండ్స్ బ్యాడ్జీలను ధరించి తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగిందన్నారు.

 

Anganwadi workers' demands must be addressed.

 

కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలను అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే అంగన్వాడీ విధులకు సంబంధం లేని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ, పి.ఎం.శ్రీ సెంటర్లను అంగన్వాడీ టీచర్లకు అప్పగించాలని, సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా గ్రాట్యూటీని ఇవ్వాలని, రిటైర్ అయిన వారికి పెన్షన్స్ సౌకర్యాన్ని, గ్రాట్యూటీని వెంటనే ఇవ్వాలని, పని భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Anganwadi workers' demands must be addressed.

More articles

Latest article