24.8 C
Hyderabad
Friday, July 31, 2026

మాదిగ సర్టిఫికెట్ల దుర్వినియోగంపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ

హైదరాబాద్, బతుకమ్మ :

 

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను బుధవారం టీఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, టీఎండి వ్యవస్థాపక అధ్యక్షుడు కనకరాజు మాదిగ నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా టీఎంఆర్పీఎస్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మారం అవిన్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చిన విషయాల ప్రకారం, కొన్ని మాంగ్ కులానికి చెందిన వ్యక్తులు ఎస్సీ మాదిగ కుల ధృవపత్రాలు పొందుతూ గ్రూప్-1 వంటి ఉద్యోగాలలో అవకాశాలు పొందుతున్నారని ఆరోపించారు. “లోక్సాహెర్ అన్న బహు సాటే మాదిగ సంఘం” పేరుతో మాదిగలకు రావాల్సిన సంక్షేమ ప్రయోజనాలు ఇతరులు అక్రమంగా పొందుతున్నారని వారు తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్ 27 న జిల్లా కలెక్టర్‌కు జిల్లా కమిటీ తరఫున వినతిపత్రం అందజేసినట్లు నాయకులు పేర్కొన్నారు. తప్పుడు కుల ధృవపత్రాలపై విచారణ చేపట్టేందుకు స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై సమగ్ర విచారణ జరిపే కమిటీ ఏర్పాటు చేయాలని సూచిస్తానని హామీ ఇచ్చారు. నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ టౌన్ నాయకుడు పొందుర్తి జ్ఞానేశ్వర్, నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article