27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పంచాయితీరాజ్ కమిషనర్ ను కలిసిన ఉద్యోగులు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పరిషత్ లో విధి నిర్వహణ చేస్తూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా జూనియర్ సహాయకులుగా (సూపర్ న్యూమరి పోస్టులు) నియమితులై రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసారు. తెలంగాణ పంచాయితీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, కోశాధికారి విఠల్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ ను కలిసి తమ డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రం సమర్పించారు. 2023లో నియమితులైన 50 మంది ఉద్యోగులకు సంబంధించి సూపర్ న్యూమరి పోస్టులలో నియమితులైన వారు ఐదు సంవత్సరాల నుంచి సర్వీసు రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పూర్తయిందని కాబట్టి నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించాలని పంచాయితీరాజ్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.

 

Representation submitted to TPCC's Mahesh Kumar Goud seeking service regularization.

More articles

Latest article