. . . ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా లంచం స్వీకరణ
వెబ్ డెస్క్, బతుకమ్మ :
బోర్‌వెల్ రిగ్గు పర్మిషన్ మంజూరు చేసేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ద్వారా రూ.20 వేల లంచం తీసుకుంటూ భూగర్భ జలశాఖాధికారి అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి మెగావత్ బాలు బోర్ వేల్ యజమానికి పర్మిషన్ తో పాటు అనవసర జరిమానాలు విధించకుండా ఉండాలంటే రూ.20 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. రిగ్గు యజమాని ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం సూర్యపేట్ భూగర్భజలశాఖలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న కొసరాజు వెంకటేశ్వర్లు ద్వారా రూ.20 వేలు లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మెగావత్ బాలుకు సంబంధించిన ఇళ్ళలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.