27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్వగ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

 

. . . ఆలయ ప్రాంగణంలో వంటశాల ప్రారంభోత్సవం

 

. . . ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోనే రాజకీయంలో రాణిస్తూ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ రూరల్ మండలం జలాల్ పూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో స్వర్గీయ బాలాపురం రుక్మాబాయి జ్ఞాపకార్థం వారీ కుటుంబ సభ్యులు బాలాపురం గంగారెడ్డి, లక్ష్మారెడ్డి, భాస్కర్ రెడ్డి (దాతలు) సహకారంతో నిర్మించిన నూతన వంటశాల, భోజన శాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం దాతలను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజల పై అమ్మవారి ఆశీస్సులు ఉండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… జలాల్పూర్ గ్రామం అన్ని రకాలుగా చైతన్యవంతమైనదని పేర్కొన్నారు. రాజకీయ బేషజాలలు లేకుండా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. గ్రామంలో ఏ పార్టీ వాళ్ళు ఉన్న వారివారి విధానాలకు అనుగుణంగా పనిచేసుకుంటారు.. అయినా ఏరోజు వారిని రాజకీయ దురుద్దేశంతో చూడలేదన్నారు. జిల్లాను వ్యవసాయ రంగంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంచిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడం, పేదరిక నిర్మూలన, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు వడ్డీలేని రుణాలు, తదితర సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల ఇలా అనేకమైన కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసిడిఎంఎస్ చైర్మన్ లు సాయరెడ్డి, తారాచంద్, నాయకులు బాగా రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్, కుమార్ రెడ్డి, మోహన్ స్థానిక గ్రామ సర్పంచ్  నవనీత-వెంకట్ రెడ్డి , ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

Efforts towards the development of the Goddess Mahalakshmi temple.

More articles

Latest article