. . . ఒకరు స్పాట్ డెడ్
. . . మరొకరికి తీవ్ర గాయాలు
. . . మైనర్ డ్రైవింగ్ కారణం
గాంధారి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో దారుణం జరిగింది. బుధవారం ఆర్థ రాత్రి పూట విధులు నిర్వహిస్తున్న బ్లూ కోట్ పోలీస్ సిబ్బంది ని కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాంధారి మండల కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్ , సుభాష్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తు బైక్ పై రోడ్డు పైన నిల్చున్నారు. అతి వేగంగా వచ్చిన కార్ వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో రవికుమార్ స్పాట్ డెడ్ అయ్యారు. కార్ వేగంను గమనించి పక్కకు పరిగేత్తడంతో సుభాష్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ఘటన స్థలంలో ఎస్ఐ అంజనేయులు కుడా పక్కన విధులలో ఉండగా ఘటన జరిగినట్లు తెలిసింది.
ప్రమాదానికి కారణమైన కారు గాంధారికి చెందిన ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ది అని సమాచారం. అతని పుత్రుడు కారు నడిపి కానిస్టేబుల్ మరణం కు మరోకరి గాయాలకు కారకుడని సమాచారం. ఈ ప్రమాదం రాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగగా వీడియో సిసి టివి పుటేజీ కార్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ అని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదం ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. రవి కుమార్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వారు అని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

