ఇసుక అక్రమ రవాణా.. 5 టిప్పర్ల పట్టివేత

0 1,957

బతుకమ్మ బోధన్ : ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు. బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశానుసారం స్పెషల్ స్క్వాడ్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో బోధన్ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 5 టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అధికారులు వాహనాలను సీజ్ చేసి, రూ. 2 లక్షల జరిమానా విధించారు.

Leave A Reply

Your email address will not be published.