24 C
Hyderabad
Sunday, August 2, 2026

పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్నికేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం లాంచ‌నంగా ప్రారంభించారు.  ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ చేరుకున్న ఆయ‌న అక్క‌డ నుంచి హెలికాప్టర్ లో ఇందూరుకి చేరుకున్నారు. అనంత‌రం పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పా టు చేసిన పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సభలో అమిత్ షా పాల్గొన్నారు. కంఠేశ్వర్ కూడలిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆయ‌న అవిష్క‌రించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ ,ఎంపీ ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు పాల్గొన్నారు.

More articles

Latest article