26.2 C
Hyderabad
Monday, August 3, 2026

స్వేచ్ఛ మరణం పట్ల కవి కంకణాల దిగ్బ్రాంతి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ప్రముఖ తెలుగు ఛానల్ రీడర్, జర్నలిస్ట్ వొటార్కర్ స్వేచ్ఛ బలవన్మరణం పట్ల కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా పలు న్యూస్ చానళ్ళలో పనిచేసిన స్వేచ్ఛ మంచి గుర్తింపును పొందిందన్నారు. ఇటీవలే జరిగిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లోఈ. సీ మెంబర్ గా ఎన్నికయ్యారు. చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, జవహర్ షాలం లతా నిలయం లోని పెంట్ హౌస్ లో నివాసం ఉంటున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. రాంనగర్ లో నివాసం ఉంటున్న ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీడీయస్ యు స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేయగ, తల్లి శ్రీదేవి చైత్యన మహిళా సంఘంలో పని చేస్తున్నారు. విప్లవ భావాలున్న కుటుంబంలో జన్మించిన స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం నమ్మలేకపోతున్నమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More articles

Latest article