పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్నికేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం లాంచ‌నంగా ప్రారంభించారు.  ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ చేరుకున్న ఆయ‌న అక్క‌డ నుంచి హెలికాప్టర్ లో ఇందూరుకి చేరుకున్నారు. అనంత‌రం పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పా టు చేసిన పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సభలో అమిత్ షా పాల్గొన్నారు. కంఠేశ్వర్ కూడలిలో ఏర్పాటు...