29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందూర్‌ ప్రైమరీ స్కూల్లో అంబరాన్నంటిన సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ లోని రాకాసిపేట్ లో గల ఇందూర్‌ ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ, విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలు చీరలు, పూలతో సాంప్రదాయవంతంగా అలంకరించుకుని ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, నృత్యాలతో అలరించారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆరాధించే విశిష్ట ఆచారాన్ని ప్రతిబింబిస్తుందని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. అలాగే విజయదశమి సందర్భంగా  విద్యార్థుల్లో విజ్ఞాన దీప్తి రగల్చేలా పాఠశాల ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే ఈ ఉత్సవాలు విద్యార్థుల్లో ఆనందం నింపాయి. బతుకమ్మ విశిష్టతతో పాటు విజయదశమి పండుగలో సత్యం చెడుపై గెలిచిన శుభసందేశం విద్యార్థులకు చేరువయ్యింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ కిషోర్, ప్రిన్సిపాల్ సుధారాణి,విద్యావికాస్ కరస్పాండెంట్  శ్రీనివాస్ రావు , వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ హరికృష్ణ.ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Amber-like celebrations at Indore Primary School

Amber-like celebrations at Indore Primary School

More articles

Latest article