26.3 C
Hyderabad
Monday, August 3, 2026

అయ్యల స్వామి సన్నిధిలో గాజుల పండుగ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామ ఇలావేలుపు శ్రీ అయ్యల రాజ రాజేశ్వర స్వామి సన్నిధిలోని అయ్యగుట్ట మొండయ్య కల్యాణ మంటపంలో శుక్రవారం గాజుల పండగను ఘనంగా జరుపుకొన్నారు. 2008-2009 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థినీలు అందరు ముందుగా స్వామి వారిని దర్శించుకొని, పారాణి దిద్దుకొన్నారు. అనంతరం ఒకరినొకరు పసుపు, కుంకుమలు ధరించికొని తమ తమ స్నేహాన్ని తలచుకొని పూలు, గాజులను వేసుకొని స్నేహితుల గాజుల పండగను నిర్వహించుకొన్నారు. ఈ కార్యక్రమంలో సౌందర్య, మధుమిత, కృష్ణవేణి, మౌనిక, అశ్విని, గౌతమి, రోజా, ప్రత్యుష,అనూషా, దీప తదితరులు పాల్గొన్నారు.

Bangles festival in the presence of Ayyala Swami

More articles

Latest article