ఇందూర్‌ ప్రైమరీ స్కూల్లో అంబరాన్నంటిన సంబరాలు

బతుకమ్మ, బోధన్ : బోధన్ లోని రాకాసిపేట్ లో గల ఇందూర్‌ ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ, విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినిలు చీరలు, పూలతో సాంప్రదాయవంతంగా అలంకరించుకుని ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, నృత్యాలతో అలరించారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆరాధించే విశిష్ట ఆచారాన్ని ప్రతిబింబిస్తుందని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. అలాగే విజయదశమి సందర్భంగా  విద్యార్థుల్లో విజ్ఞాన దీప్తి రగల్చేలా పాఠశాల ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు...