ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి మందిరంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆంజనేయ మాల ధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రాకేష్ పంతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భిక్ష లో సుమారు 200 వరకు హనుమాన్ మాల ధారణ స్వాములు పాల్గొన్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోవ దేవ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు ఈ భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగ ఉందన్నారు. ఈ భిక్ష కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి, శ్రీనివాస్, డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, ఎన్.ఎస్.యు.ఐ మండల అధ్యక్షుడు బద్దం లింగారెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు మూస్కు మోహన్ రెడ్డి, మండల ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు పన్నాల నర్సారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జుంగల గణేష్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దండ బోయిన సాయి, కూరాకుల బోర్రన్న, మేకల సాయన్న, మినుముల సాగర్, మాధస్తు చిన్నయ్య, మండల పరిధిలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
