కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్తులకు భిక్ష

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి మందిరంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆంజనేయ మాల ధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రాకేష్ పంతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భిక్ష లో సుమారు 200 వరకు హనుమాన్ మాల ధారణ స్వాములు పాల్గొన్నట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోవ దేవ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ లు మాట్లాడుతూ...