24.7 C
Hyderabad
Monday, August 3, 2026

యుద్ధాలు నివారించి, ప్రపంచ శాంతిని కాపాడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిపిఎం శాంతి ప్రదర్శన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్దాన్ని నివారించాలని, యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదాలతో సీపీఎం నాయకులు శనివారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పైన దాడి నేటికి 11 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎంతో మంది గాయాల పాలయి నిరాశ్రయులుగా మారుతున్నారని, ప్రజా ధనం, ఆస్తులు దెబ్బతింటున్నాయని ఈ యుద్ధం మూలంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఫ్రూట్ ఆయిల్ కొరతతో పాటు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, వీటి మూలంగా బతుకుదెరువు కొరకు అరబ్ దేశాలకు వెళ్లిన పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకొని యుద్ధాన్ని నివారించి చర్చల ద్వారా పరిష్కారాన్ని చూపించాలని డిమాండ్ చేస్తూ శాంతి ర్యాలీని నిర్వహించారు.

 

We must prevent wars and maintain world peace.

 

అనంతరం జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్, ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి తమ దేశంలోని జైల్లో నిర్బంధించటం తో పాటు ఇరాన్ పైన దాడి చేసి యుద్దానికి కాలు దువ్విందని, ఫలితంగా ప్రపంచంలో అశాంతి పెరిగిందని, దీని పైన భారత ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని కనబరచకపోవటం సరైనది కాదని ఐక్యరాజ్యసమితి మీద ఒత్తిడి తీసుకువచ్చి యుద్ధాన్ని నివారించే పద్ధతుల్లో ప్రపంచంలో ధరలు పెరగకుండా అరికట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై కూడా ఉన్నదని వారు అన్నారు. అమెరికాకు అన్ని సందర్భాల్లో మోకరిల్లడం భారత ప్రభుత్వానికి సరైనది కాదని సంఘ విధానాన్ని దేశ స్వాతంత్రాన్ని అనుసరించాలని వారు అన్నారు. యుద్ధం నివారణకు, ప్రపంచ శాంతికి ప్రజలందరూ సహకరించాలని అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాల్లో కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పలుపు వెంకటేష్, నూర్ జహాన్, సుజాత, గంగాధర్, నన్నే సాబ్, సిర్ప లింగం అనసూయమ్మ, అనిత, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article