. కుంభ మేళా తరహాలో రజతోత్సవ సభ
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
. ఎల్కతుర్తిలో సభాప్రాంగణం పరిశీలన
వరంగల్, బతుకమ్మ: కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కుంభమేళా తరహాలో రజతోత్సవ సభ జరగబోతోందని ఆమె పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో సిద్ధమవుతున్న రజతోత్సవ సభా ప్రాంగణాన్ని నాయకులతో కలిసి కవిత గురువారం పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటే, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఓట్లు పొందే ప్రయత్నాలు చేస్తాయని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ నైజం తెలిసిపోయిందని, 16నెలల కాలంలో 16 పనులు కూడా కాలేదన్నారు. దేశానికి సేవలందించేందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు. ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలను ప్రజలు నమ్మరని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఎన్నో అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేసి రక్తం చుక్క చిందకుండా రాష్ట్రం సాధించారన్నారు. తెలంగాణలోని ప్రజాస్వాములంతా రజతోత్సవ సభకు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
