కాంగ్రెస్ చేతిలో మోసపోయిన వారందరూ తరలిరావాలి
. కుంభ మేళా తరహాలో రజతోత్సవ సభ . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత . ఎల్కతుర్తిలో సభాప్రాంగణం పరిశీలన వరంగల్, బతుకమ్మ: కాంగ్రెస్ ను నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కుంభమేళా తరహాలో రజతోత్సవ సభ జరగబోతోందని ఆమె పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో సిద్ధమవుతున్న రజతోత్సవ సభా ప్రాంగణాన్ని నాయకులతో కలిసి కవిత గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటే, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ప్రజల మధ్య...