- నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చేతులమీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్నారు. ప్రభుత్వం వచ్చిన 18 నెలలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలపాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కల ఇందిరమ్మ ఇల్లు ను, ఉచిత రేషన్ కార్డులు, నిరుపేదలకు సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఆకుల శ్రీనివాస్, సంజయ్ గౌడ్, గురిజాల అక్షయ్ ,డాక్టర్ సురేష్,ఎండీ రఫిక్ ,లక్ష్మణ్, సంతోష్, పి.రవి ,ఆకుల రవి, ఆకుల ప్రవీణ్, మిద్దెల నరేష్, శ్రీకాంత్, మల్లేష్ ముమ్మిడి సతీష్, కలిగొట్ట లక్ష్మణ్, జీవరత్నం,సోలమన్, శ్రీకాంత్,రమేష్, ముక్కిర సాయిలు, సంపంగి రమేష్, మొగలి లక్ష్మణ్,బండ ప్రభాకర్, ఆకుల సుధాకర్,మెదేలా మహేందర్, బట్టుమహిపాల్, మోహన్ నాయక్, కాశీరాం, నిమాల సతీష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్, కిషోర్ గౌడ్, గౌసుద్దీన్, ఎల్లయ్య, ఆకుల జగన్, ఇషాక్, కేతావత్ రామ్ సింగ్, సీతారాం సిరికొండ యువజన ఉపాధ్యక్షులు జీవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
