- రైతుల హక్కుల కోసం గొంతెత్తిన నేతలు
నిజాంసాగర్, బతుకమ్మ: రైతుల హక్కుల పరిరక్షణ కోసం నిజాంసాగర్ మండలంలో అఖిలపక్ష ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, రైతుల హక్కులు అనేది రాజకీయాలకు అతీతమని, భూముల రక్షణ కోసం అన్ని పార్టీలు కృతనిశ్చయంతో ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఈ అఖిలపక్ష ధర్నా రైతుల సమస్యల పట్ల సమాజం చూపవలసిన చైతన్యాన్ని ప్రతిబింబించిందని, భవిష్యత్తులో కూడా ఈ పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశ్యం నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని భూములను తీసుకోవడాన్ని నిరసించటమేనని అన్నారు. రైతులు వినతులు చేస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకతాటిపైకి వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు.
145
