నిజాంసాగర్ ప్రాజెక్టు భూముల రక్షణ కోసం అఖిలపక్ష ధర్నా

 రైతుల హక్కుల కోసం గొంతెత్తిన నేతలు   నిజాంసాగర్, బతుకమ్మ: రైతుల హక్కుల పరిరక్షణ కోసం నిజాంసాగర్ మండలంలో అఖిలపక్ష ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, రైతుల హక్కులు అనేది రాజకీయాలకు అతీతమని, భూముల రక్షణ కోసం అన్ని పార్టీలు కృతనిశ్చయంతో ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఈ అఖిలపక్ష...