Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 6:26 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలు రద్దు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ మినహ అన్ని కమిటీలను ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రద్దు చేశారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా కేసిఆర్ బిఆర్ఎస్ రాష్ట్ర కమిటి మినహా అన్ని కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు త్వరలో అన్ని స్థాయిల కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు.