25.5 C
Hyderabad

మెడికవర్ ఆసుపత్రిలో మెదడు, నరాల వ్యాధులకు మెరుగైన వైద్యం

Advanced treatment for brain and neurological disorders at Medicover Hospital.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య, న్యూరో ఫిజిషియన్ డా. మొహసీన్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ప్రత్యేక న్యూరో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అనుభవజ్ఞులైన న్యూరో వైద్య నిపుణుల న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య, న్యూరో ఫిజిషియన్ డా. మొహసీన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదడు, వెన్నుపాము, నరాల సంబంధిత వివిధ సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తస్రావం, బ్రెయిన్ ట్యూమర్స్, అన్యూరిజమ్స్, మూర్ఛ, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, నరాల నొప్పులు, వెన్నుపాము సంబంధిత సమస్యలు తదితర వ్యాధులకు అవసరమైన నిర్ధారణ, వైద్య చికిత్స , శస్త్రచికిత్స సేవలు అందుబాటులో తమ ఆసుపత్రిలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. స్ట్రోక్ వచ్చిన సమయంలో ముఖం ఒక వైపుకు వంగడం, ఒక చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం లేదా అర్థం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు సూచించారు. సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయం, శాశ్వత వైకల్యం ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో న్యూరో సంబంధిత అత్యవసర పరిస్థితులకు అవసరమైన ఆధునిక వైద్య సదుపాయాలు, డయాగ్నస్టిక్ సేవలు, క్రిటికల్ కేర్ మరియు నిపుణుల వైద్య బృందం అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. నిజామాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు న్యూరో సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లోనే నిపుణుల న్యూరో వైద్య సేవలను పొందవచ్చని ఆసుపత్రి యాజమాన్యం తెలిపారు.

More articles

Latest article