హన్మకోండ, బతుకమ్మ :
ఒక ప్రైవేటు స్కూల్ కు రెన్యువల్ కోసం రూ.60 వేలు లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ అవినీతి నిరోధక శాఖ కు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. హన్మకోండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఇంచార్జీ డిఇఓ గా పని చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ద్వార స్కూల్ అనుమతులను పునరుద్ధరించేందుకు పాఠశాల యాజమాన్యం వద్ద రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఎసిబి డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హన్మకోండ కలెక్టరేట్ లో దాడి చేసి అదనపు కలెక్టర్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ ను పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు.
