24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నాలుగు కోట్ల హవాలా మనీ మూలాలు ఇందూర్ లోనే

Must read

📰 Generate e-Paper Clip

. . . బోయిన్ పల్లిలో పట్టుబడిన భారీ నగదు
. . . శామీర్ పేట్ వరకు 15 కిలో మీటర్లు చేజ్ చేసి పట్టుకున్న టాస్క్ పోర్స్
. . . కారు ఢీక్కిలో టైర్లు,బ్యానెట్ సీట్ల కింద నోట్ల కట్టలు 
నిజామాబాద్ , బతుకమ్మ :

హైదరాబాద్ నగర శివారులోని బోయినిపల్లి మీదుగా హవాలా సొమ్ము భారీగా తరలుతుందని విశ్వసనీయ సమాచారంతో టాస్క్ పోర్స్ పోలీసులు కాపు కాశారు. ఒక కారు పోలీసుల అనుమానంతో ఆపేందుకు యత్నించగా దాని డ్రైవర్ ఆపకుండా కారును ముందుకు తీసుకెళ్లాడు. పోలీసులు దానిని చేజ్ చేశారు. బోయినిపల్లి నుంచి శామీర్ పేట్ వరకు వెళ్లిన కారును వెంబడించి మరీ పట్టుకున్నారు. కారును సోదాలు చేయగా కారు డిక్కీలోని టైర్లు , బ్యానెట్,సీట్లలో దాచిన రూ.4 కోట్ల కట్టలు కనిపించడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్న భారీగా హవాలా సొమ్ము తరలివస్తుందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం కావడంతో నాలుగు కోట్ల నగదు పట్టుబడింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయితీ పోరు కోసం ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెల్సిందే. అయినప్పటికీ కొందరు భారీగా నగదు తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయంగా సమాచారం అందింది. దానితో నిఘా పెట్టిన పోలీసులు అనుకున్నట్లుగానే అనుమానం కలిగిన కారును 15 కిలో మీటర్ల వరకు చేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకుని భారీగా నగదును సీజ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో గత కొంత కాలంగా హవాలా మనీ చెలామణి అవుతుంది. గతంలో హుండీ పేరిట ఈ దందా జరిగింది. గతంలో హుండీ డబ్బులను వ్యక్తిగత ఖాతాలలో జమ చేసేందుకు ఏటీఎంలను అడ్డాగా చేసుకుని ముఠా పని చేసింది. దానిపై స్థానిక పోలీసులు నజర్ వేయడంతో నేరుగా ఎవరికి డబ్బులు చెల్లించాలో వారికే రవాణా జరుగుతుంది. అదిచాలదన్నట్లు జిల్లాలో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహరం కూడా కొనసాగుతుంది. దసరా పండుగకు కొన్ని రోజులు ముందుగా నిజామాబాద్ లో బంగారం పట్టుబడిన విషయం తెల్సిందే. శుక్రవారం హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న హవాలా మనీ రవాణా సూత్రదారులు గతంలో పోలీసుల నుంచి సినీ ఫక్కీలో తప్పించుకున్నారు. కానీ ఈసారి పకడ్బందీగా ప్లాన్ వేసి పట్టుకోవడంలో సఫలమయ్యారు. దొరికిన ముగ్గురు వ్యక్తులను డబ్బు ఎక్కడి నుంచి ఎవరికి తరలిస్తున్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ నుంచే దాని మూలాలు ఉండడంతో జిల్లాలో హవాలా దందా వ్యవహరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రముఖ ఆసుపత్రి న్యూరో డాక్టర్ కు సంబంధించిన ఇంటిలో నిజామాబాద్ టాస్క్ పోర్స్ పోలిసులు దాడులు చేశారు. అనాడు పొలిసులను మెనేజ్ చేసి తప్పించుకున్నాడనే చర్చ జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో గోల్డ్ స్మగ్లింగ్ తో పాటు హవాలా దందా జరుగుతున్న విషయం నిఘా వర్గాల వద్ధ ఉంది. దసరాకు కోన్ని రోజుల ముందు గోల్డ్ స్మగ్లింగ్ దందా వ్యవహరంలో ఓ అధికారి చక్రం తింపి బంగారంను తక్కువగా చూపించాడు అనే ఆరోపణలను మూటగట్టుకున్నారు. నిజామాబాద్ లో పనిచేసిన సదరు అధికారికి బంగారం స్మగ్లింగ్ తో పాటు హవాలా గుట్టు అంతా తెలుసు అని ఆర్మూర్ లో అంతా కోడై కూస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ మూఠా తో రాసుకుపుసుకు తిరగడం వాటాలు తీసుకోవడం అయనకే చెల్లించదని పోలీ0స్ శాఖలో అందరికి తెలిసిన వ్యవహరమే. తనకు ఏ చిన్న అవకాశం దొరికిన అంతా హంఫట్ అనే చర్చ సొంత శాఖలో ఉంది. ఇటీవల కాలంలో ఇల్లీగల్ దందాలలో సదరు అధికారి వ్యవహర శైలిపై ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. దానిపై ఇంటలిజెన్స్ నివేధికలు కూడా పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం హైదరాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులకు చిక్కిన 4 కోట్ల హవాలా మనీ వెనుక ఉన్న సూత్రాదారులు ఎవ్వరో తెలిసిన తరువాతనే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

More articles

Latest article