. . . 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
. . . ఇద్దరిని సికింద్రాబాద్ లో గుర్తింపు
కోటగిరి, బతుకమ్మ:
కోటగిరి మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల నుంచి మిస్సింగ్ అయిన ఇద్దరు విద్యార్థుల కథ 24 గంటలలో సుఖాంతమైంది. కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అంబం గ్రామానికి చెందిన కౌ లేడీ పండరి (13) అంబం గ్రామం, ఘన్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మపూర్ దీక్షిత్ (15) గురువారం రాత్రి పాఠశాల నుండి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. విద్యార్థులు కుటుంబ సభ్యులకు విచారించగా ఇంటికి రాదే రాలేదని తెలుపడంతో పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ కాలీక్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు స్థానిక ఎస్సై సునీల్ తెలిపారు. గురువారం రాత్రి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల నుండి పారిపోయిన ఇద్దరు ఎనిమిదవ తరగతి విద్యార్థులు గంటల వ్యవధిలోనే ఆచూకీని గుర్తించారు. విద్యార్థులు ఇద్దరు సికింద్రాబాద్లోని తమ బంధువుల ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల చొరవతో మిస్సింగ్ కేసు సుఖాంతం అయింది.

