30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీఆర్ఎస్వీ విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రైవేటు వ్యాపారంగా ప్రైవేటు పాఠశాలలు మారాయన్నారు. జిల్లాలో 99 శాతం పాఠశాలలో అత్యధిక ఫీజులు, పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని తెలిపారు. నర్సరీ నుంచి లక్షల్లో ఫీజులు రాబడుతున్న విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.  తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతూ నర్సరీ నుంచి పాఠ్యపుస్తకాల పేరుతో రూ. 8000 రూపాయలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు.  ప్రైవేటు పాఠశాలలో వ్యాపారంగా మారిన విద్యాశాఖలో ఎలాంటి చలనం లేకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు సుమన్, బన్నీ, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Action should be taken against schools charging high fees

More articles

Latest article