అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

బీఆర్ఎస్వీ విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రైవేటు వ్యాపారంగా ప్రైవేటు పాఠశాలలు మారాయన్నారు. జిల్లాలో 99 శాతం పాఠశాలలో అత్యధిక ఫీజులు, పాఠశాలల్లోనే పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని తెలిపారు. నర్సరీ నుంచి లక్షల్లో ఫీజులు రాబడుతున్న విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం...