ముప్కాల్, బతుకమ్మ: ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాఖీ పండుగా సోదరి, సోదర ప్రేమకు ప్రతీక అని పాఠశాల కరస్పాండెంట్ సోహేల్ అన్నారు. పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో రాఖీలు కట్టుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
